Fire accident | ఇంట్లో ఎగిసిపడిన మంటలు.. ఐదుగురు సజీవదహనం.. నలుగురికి తీవ్ర గాయాలు
Fire accident | ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లక్నో జిల్లా కకోరిలోని హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలోగల ఓ రెండంతస్తుల భవనంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లోని ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
Fire accident: ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లక్నో జిల్లా కకోరిలోని హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలోగల ఓ రెండంతస్తుల భవనంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లోని ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
పోలీసులతో కలిసి క్షతగాత్రులను, మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పటాకుల పేలడం వల్లే ముందుగా మంటలు చెలరేగి, ఆ తర్వాత సిలిండర్ పేలినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, హతా హజ్రత్ సాహెబ్ నివాసి అయిన ముషీర్ అలీ (50).. జర్దోసీ పనితోపాటు పటాకుల వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆయన ఇంటి రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంతలోనే సిలిండర్ పేలింది. ఇంట్లో ఉన్నవారు నిద్రలేచి బయటకు వచ్చేంతలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

