Firing at Congress candidate’s convoy | కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు.. అనుచరుడికి బుల్లెట్ గాయాలు
Firing at Congress candidate's convoy | కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఆయన అనుచరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ కాల్పుల సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చండీగఢ్: కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఆయన అనుచరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ కాల్పుల సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Firing at Congress candidate’s convoy) అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో ఈ సంఘటన జరిగింది. కల్కా నియోజకవర్గం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పంచకులాలో ఆయన కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆ ఎమ్మెల్యే అనుచరుడైన గోల్డీకి రెండు బుల్లెట్ గాయాలయ్యాయి.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్ గాయాలైన గోల్డీని చికిత్స కోసం చండీగఢ్‌లోని పీజీఐకి తరలించారు. అతడికి నేర కార్యకలాపాలతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముఠాల మధ్య శత్రుత్వమే ఈ కాల్పులకు కారణమని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. 400 కొట్టిన చిన్మయ సుతార్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

