న్యూఢిల్లీ : ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో వాణిజ్య భవనం గోపాల్‌దాస్ భవన్లో గురువారం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ఘటనా స్ధలానికి 15 అగ్నిమాపక యంత్రాలను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
భవనంలోని 11వ ఫ్లోర్లో అగ్రిప్రమాదం జరిగింది. మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతుండటంతో ఈ ప్రాంతాన్ని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం అగ్నిప్రమాదానికి కారణాలు ఇతర వివరాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు.
Read More :
Prabhas | ప్రభాస్‌తో చాలా డేంజర్.. రెబల్‌స్టార్‌పై మలయాళ స్టార్ హీరో కామెంట్స్