Fire Accident | ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం : ఎగిసిపడిన మంటలు
దేశ రాజధానిలోని పశ్చిమ ఢిల్లీ నిలోథి గ్రామంలోని ఓ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఘటనా స్ధలానికి పది అగ్నిమాపక యంత్రాలను తరలించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీ : దేశ రాజధానిలోని పశ్చిమ ఢిల్లీ నిలోథి గ్రామంలోని ఓ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఘటనా స్ధలానికి పది అగ్నిమాపక యంత్రాలను తరలించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో పెద్దసంఖ్యలో ప్లాస్టిక్ పైపులు నిల్వ చేసి ఉండటం విజువల్స్‌లో కనిపించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లిన వివరాలను ఇంకా అధికారులు వెల్లడించలేదు.
కాగా, మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించింది. కాగా ఈనెల 11న ఢిల్లీలోని భవానా ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించగా కొద్దిరోజులకే ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
Read More :
Prithvi Shaw | కిందపడుతుంటే ఎవరూ పట్టించుకోరు.. పృథ్వీషా ఆసక్తికర ఇన్‌స్టా స్టోరీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

