న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ‘రాజకీయ రావణుడు’ అంటూ షెకావత్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ సింగ్ జదావత్ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 27న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జన ఆక్రోశ్ ర్యాలీలో గజేంద్రసింగ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.