High Court | చెన్నై: అపార్ట్మెంట్ల ప్రాంగణాల్లో పెంపుడు జంతువుల యజమానులపై అపార్ట్మెంట్ యజమానుల సంఘం ఆంక్షలు విధించడం చట్ట విరుద్ధమని ఓ చెన్నై కోర్టు తీర్పుచెప్పింది. తిరువన్మయూర్ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన అలాంటి తీర్మానాన్ని చట్ట విరుద్ధంగా పేర్కొంది. అలాంటి చర్యలు పెంపుడు జంతువుల యజమానుల హక్కులను ఉల్లంఘిస్తాయని చెప్పింది. మనోరమ (78) అనే వృద్ధురాలు వేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
అత్రియం ఓనర్స్ అసోసియేషన్ పెంపుడు జంతువులను లిఫ్ట్‌లలో తీసుకెళ్లడంపై నిషేధం విధించిందని.. పెంపుడు జంతువులు మల విసర్జన చేస్తే జరిమానాలు విధిస్తున్నదని మనోరమ నిరుడు జూలైలో సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ పిటిషన్ కొట్టేయడాన్ని పై కోర్టులో ఆమె సవాల్ చేశారు. అక్కడ విచారణ సందర్భంగా జడ్జి అబ్రహాం లింకన్ మాట్లాడుతూ పెంపుడు జంతువుల వ్యర్థాల నిర్వహణపై స్కూప్-ది-పూప్(ఎప్పటికప్పుడు ఒక డబ్బాలో విసర్జితాలను సేకరించడం) లాంటి ఆచరణీయ పరిష్కారాలను అమలు చేయాలని సూచించారు.