UPI Payments | ఎండీఆర్ చార్జీలపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ..!
UPI Payments | త్వరలోనే యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చెంట్ ఛార్జీల (MDR)ను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం, వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఖండించింది.
UPI Payments | త్వరలోనే యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చెంట్ ఛార్జీల (MDR)ను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం, వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తప్పుడు వార్తలు, నిరాధారమైనవని, తప్పుదారి పట్టించేవి అని పేర్కొంది. మర్చంట్ టర్నోవర్ కంటే ట్రాన్సాక్షన్ విలువ ఆధారంగానే ఛార్జీలను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. రూ.3 వేల కంటే ఎక్కువ ఉన్న అన్ని యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను విధించే అవకాశం ఉందని.. చిన్న మొత్తాలపై ఎలాంటి ఫీజులు ఉండవని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ స్పందిస్తూ ఎండీఆర్ వసూలు చేయబడుతుందనేది ఊహాగానాలు మాత్రమేనని.. ఇందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు పౌరుల్లో అనవసరమైన అనిశ్చితి, భయం, అనుమానాలను కలిగిస్తాయని.. యూపీఐ ద్వారా చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రిత్వశాఖ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
Speculation and claims that the MDR will be charged on UPI transactions are completely false, baseless, and misleading.
Such baseless and sensation-creating speculations cause needless uncertainty, fear and suspicion among our citizens.
The Government remains fully committed…
— Ministry of Finance (@FinMinIndia) June 11, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

