పండుగల వేళ జాగ్రత్త.. ఐసీఎంఆర్ వార్నింగ్

న్యూఢిల్లీ: కేరళలో కరోనా ఇన్ఫెక్షన్లు తగ్గుతున్నట్లు ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ డాక్టర్ బల్రామ్ భార్గవ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ఆయన చెప్పారు. అయితే పండుగల సీజన్ ఉన్నందున ప్రజలు భారీ సంఖ్యలో గుమ్మికూడే అవకాశాలు ఉన్నాయని, అలాంటి వాతావరణంలో మళ్లీ వైరస్ ప్రబలే అవకాశాలు ఉన్నట్లు ఆయన వార్నింగ్ ఇచ్చారు. అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని, కోవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించాలని, బాధ్యతాయుతంగా ప్రయాణించాలని, పండుగలను కూడా బాధత్యతో జరుపుకోవాలని బల్రామ్ భార్గవ్ తెలిపారు.
దేశవ్యాప్తంగా రిపోర్ట్ అవుతున్న కేసుల్లో కేరళలోనే 68 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. కేరళలో మొత్తం 1.99 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని, మిజోరం, ఏపీ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో పది వేల యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పారు. గడిచిన 11 వారాల నుంచి పాజిటివిటీ రేటు 3 శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు రాజేశ్ తెలిపారు. 64 జిల్లాల్లో మాత్రం కోవిడ్ పాజిటివిటీ 5 శాతానికి ఎక్కువగా ఉందన్నారు.
దేశవ్యాప్తంగా 3,631 పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్లాంట్లు కమిషన్ అయిన తర్వాత సుమారు 4500 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

