చిన్నారిపై కుక్క దాడి… చూస్తూ పట్టించుకోని యజమానిపై కేసు

లక్నో: ఒక చిన్నారిపై బలమైన పెంపుడు కుక్క దాడి చేసింది. అయితే దీనిని చూసి కూడా పట్టించుకోని యజమానితోసహా మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాదల్పూర్ గ్రామంలో శుక్రవారం ఒక ఉన్నత కుటుంబానికి చెందిన పెంపుడు కుక్కను పనిమనిషి బయటకు తీసుకెళ్లింది. అయితే ఆ కుక్క ఒక బాలుడిపై దాడి చేసింది. రోడ్డుపైపడిన ఆ చిన్నారిని నోటితో పట్టుకుని కరవసాగింది. కుక్కను లాగేందుకు ప్రయత్నించిన పనిమనిషి కొంత సేపటి తర్వాత అలాగే వదిలేసి ఆ ఇంట్లోకి వెళ్లిపోయింది.
కాగా, కుక్క ఎంతకీ వదలకపోవడంతో ఆ బాబు భయంతో ఏడ్చాడు. స్పందించిన ఇద్దరు వ్యక్తులు చిన్నారిని కుక్క బారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించారు. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న బ్యాట్‌తో ఆ కుక్కను గట్టిగా కొట్టగా చివరకు అది ఆ చిన్నారిని విడిచిపెట్టి ఇంట్లోకి వెళ్లింది. అయితే, మేడమీద ఉన్న కుక్క యజమాని చిన్నారిపై దాడిని చూసి కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.
మరోవైపు స్థానికులు తమ మొబైల్లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నోయిడా పోలీసులు స్పందించారు. కుక్క యజమానితోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ కాగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు నోయిడా స్పెషల్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ఎలమారన్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- child
- Dog attacks
- Noida
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

