రైతుల ఆందోళన వెనుక రహస్య అజెండా : అనిల్ విజ్

న్యూఢిల్లీ : రైతుల ఆందోళన వెనుక రహస్య అజెండా దాగుందని హర్యానా మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. రైతుల ఉద్యమం మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం కాదని దీని వెనుక రహస్య అజెండా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిష్టంభన తొలగించేందుకు చర్చలకు సిద్దమని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెబుతున్నారని, రైతులు కూడా ఇప్పటికి పలుమార్లు మంత్రితో చర్చలు జరిపారని అనిల్ విజ్ గుర్తుచేశారు.
వ్యవసాయ చట్టాలపై తమ అభ్యంతరాలు ఏమిటో రైతు సంఘాల నేతలు చెప్పలేకపోతున్నారని అన్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే రైతులు మూడు వ్యవసాయ చట్టాల కోసం పోరుబాట పట్టలేదని ఏదో రహస్య అజెండా దాగుందని స్పష్టమవుతోందని చెప్పారు. రైతులు ఎప్పుడు చర్చలు పునరుద్ధరించాలని కోరినా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులకు సిద్ధంగా ఉందని, రైతుల వాదన విని సమస్యను పరిష్కరించేందుకు సుముఖంగా ఉందని హర్యానా మంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

