కర్నాల్‌లో కదంతొక్కిన రైతులు

- లాఠీచార్జికి నిరసనగా కలెక్టరేట్ ముట్టడి
- వాటర్ కేనన్లు ప్రయోగించిన పోలీసులు
కర్నాల్ (హర్యానా), సెప్టెంబర్ 7: హర్యానాలోని కర్నాల్‌లో మంగళవారం రైతులు కదంతొక్కారు. జిల్లా సచివాలయాన్ని ముట్టడించేందుకు వస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. అంతకుముందు జిల్లా సచివాలయానికి 5 కిలోమీటర్ల దూరంలోని న్యూ అనాజ్ మండీ వద్ద రైతులు భారీ సభ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లపై సభా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకే అధికారుల నుంచి రైతు నేతలకు కబురు అందింది. దాంతో ప్రతినిధుల బృందం అధికారులతో చర్చలకు వెళ్లింది. రైతుల డిమాండ్లను అధికారులు అంగీకరించలేదు. దీంతో సభ అనంతరం రైతులు సచివాలయం వద్దకు బయలుదేరారు. పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించినప్పటికీ తప్పించుకుని, బారికేడ్ల పైనుంచి దుంకుతూ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. గత నెల 28న కర్నాల్‌లో రైతులపై లాఠీచార్జికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ సందర్భంగా రైతుల తలలు పగులగొట్టండని ఆదేశించిన ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలన్నది డిమాండ్లలో ఒకటి. సంయుక్త కిసాన్ మోర్చా నేతలు రాకేశ్ టికాయత్, సింగ్ రాజేవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్ తదితరులు సభలో పాల్గొన్నారు.
సాగు చట్టాలపై నివేదికను బయటపెట్టండి
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలపై సుప్రీంకోర్టు కమిటీ సమర్పించిన నివేదికను బహిరంగపరచాలని ఆ కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ మంగళవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. కమిటీ ఈ ఏడాది మార్చిలో తన నివేదికను అందజేసింది. అయితే దానిపై సుప్రీంకోర్టు శ్రద్ధ కనబరిచినట్టు లేదని ఘన్వత్ ఒక లేఖలో సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. కర్నాల్‌లో రైతులపై పోలీసుల లాఠీచార్జి, దరిమిలా రైతుల ఆందోళనల నేపథ్యంలో ఘన్వత్ ఈ లేఖ రాశారు. రైతుల ఉద్యమాన్ని విరమింపజేసేలా ఈ నివేదికను ఉయోగించుకోకపోవడం బాధించిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

