Watch: రైతు వెళ్లే దారిలో పులి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Farmer's Close Encounter With Tiger | ఒక రైతు మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పొలం వైపు వెళ్తున్నాడు. ఆ గట్టు దారిలో ఒక పులి వారికి కనిపించింది. దీంతో వారిద్దరూ అప్రమత్తమయ్యారు. పులి తమ వైపు వస్తుండటాన్ని గమనించారు. అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
లక్నో: ఒక రైతు మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పొలం వైపు వెళ్తున్నాడు. ఆ గట్టు దారిలో ఒక పులి వారికి కనిపించింది. దీంతో వారిద్దరూ అప్రమత్తమయ్యారు. పులి తమ వైపు వస్తుండటాన్ని గమనించారు. అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. (Farmer’s Close Encounter With Tiger) ఇది చూసిన ఆ పులి చాలా రిలాక్స్‌గా ఆ దారిపై సేదతీరింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక రైతు మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పొలం మార్గంలో వెళ్తున్నాడు. కొన్ని అడుగుల దూరంలో గడ్డి పొదల్లో దాగిన పులి మెల్లగా బయటకు వచ్చింది. ఆ ఇద్దరిని చూసి వారి వైపు కదిలింది. బైక్‌పై కూర్చొన్న రైతు ప్రమాదాన్ని పసిగట్టాడు. వెనక్కి వెళ్లేందుకు బైక్‌ను తిప్పాడు.
కాగా, బైక్‌పై అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమైన వారిద్దరినీ ఆ పులి చూసింది. తనకు కూడా వారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అది భావించింది. దీంతో ఆ ఇద్దరిని వెంబడించడాన్ని మానుకుంది. చాలా ప్రశాంతంగా పొలం గట్టు మార్గంపై కూర్చొంది. ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘రైతు, పులి ఎదురుపడ్డారు. సహజీవనం ఇలాగే కనిపిస్తుంది. పిలిభిత్ నుంచి’ అని క్యాప్షన్ ఇచ్చారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అదృష్టవశాత్తు ఆ వ్యక్తులకు ఏమీ జరుగలేదని ఒకరు, ఆ రైతు గురించి పులికి తెలుసుంటుందని, అందుకే వారిని వెంబడించలేదని మరొకరు పేర్కొన్నారు. ఆ వ్యక్తులు వెనుతిరుగడంతో వారి నుంచి ప్రమాదం లేదని భావించిన ఆ పులి ప్రశాంతం అయ్యిందని ఒకరు అభిప్రాయపడ్డారు.
A farmer and a tiger encounter. This is what coexistence looks like. From Pilibhit. pic.twitter.com/4OHGCRXlgr
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 3, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

