Supreme Court | విభేదాలొచ్చాయని ఆ బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేం : సుప్రీంకోర్టు
Supreme Court | అత్యాచారం ఆరోపణలతో నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ముందుగా పరస్పర సమ్మతితో కొనసాగించిన బంధంలో విభేదాలు ఏర్పడితే ఆ బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు పేర్కొన్నది. కేరళ (Kerala) కు చెందిన ఓ వ్యక్తిపై నమోదైన అత్యాచారం, మోసం కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న (Justice BV Nagaratna), జస్టిస్ ఆర్ మహదేవన్ (Justice R Mahadevan) లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Supreme Court : అత్యాచారం ఆరోపణలతో నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ముందుగా పరస్పర సమ్మతితో కొనసాగించిన బంధంలో విభేదాలు ఏర్పడితే ఆ బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు పేర్కొన్నది. కేరళ (Kerala) కు చెందిన ఓ వ్యక్తిపై నమోదైన అత్యాచారం, మోసం కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న (Justice BV Nagaratna), జస్టిస్ ఆర్ మహదేవన్ (Justice R Mahadevan) లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
సంబంధాలు విఫలమైన తర్వాత క్రిమినల్ కేసులుపెట్టే ధోరణి సమాజంలో పెరిగిపోతున్నదని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది. అత్యాచారం, మోసం అనే రెండు ఆరోపణల మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓ జంట మధ్య బంధం సజావుగా సాగుతున్నప్పుడు వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, ఆ బంధం చెడిపోయిన తర్వాత అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొన్నది. పరస్పర అంగీకారంతో ఉన్న సంబంధాన్ని నేరంగా పరిగణించి ఓ వ్యక్తి స్వేచ్ఛ, గౌరవాన్ని హరించే విధంగా చర్యలు తీసుకోలేమని స్పష్టంచేసింది.
విఫలమైన బంధాలను క్రిమినల్ కేసులుగా మార్చే ధోరణి సాధారణమైపోయిందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఇదివరకే జరిగిన వివాహాన్ని దాచి ఓ వ్యక్తి తనను రెండో వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. విషయం తెలిసిన తర్వాత అతడి నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. మోసం చేసి తనను రెండోపెళ్లి చేసుకున్నందుకుగానూ అతడిపై అత్యాచారం, మోసం, నమ్మకద్రోహం ఆరోపణలతో కేసుపెట్టారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | విభేదాలొచ్చాయని ఆ బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేం : సుప్రీంకోర్టు
Double Bedroom Homes | పేదలకు అందని డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకే..!
Chinese Food | చైనీస్ ఫుడ్ వండేటప్పుడు పాత్రలపై మంటలు వస్తాయి.. ఎందుకని..?
Vatsala Rajagopal | ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత!
Kranthi Kiran | కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

