Kisan App | న్యూఢిల్లీ : ముఖం ఆధారంగా లబ్ధిదారుని గుర్తించే మొబైల్ యాప్ను కేంద్ర వ్యవసాయ శాఖ ప్రారంభించింది. దీంతో సమ్మాన్ నిధి పథకానికి రైతులు ఇక నుంచి ఓటీపీ, వేలిముద్రలు వంటివి అవసరం లేకుండానే తమ ముఖాన్ని స్కానింగ్ చేయడం ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. ముఖం స్కానింగ్ ఫీచర్తో కేంద్రం విడుదల చేసిన మొట్టమొదటి అప్లికేషన్ ఇదేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ప్రకటించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి పథకంలో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఈ యాప్ను విడుదల చేశామని తెలిపారు. మొబైల్ యాప్ను ప్రవేశపెట్టడాన్ని పలు రైతు సంఘాలు తప్పుబడుతున్నాయి. కేంద్ర పథకాలకు రైతులను దూరం చేయడానికే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యాప్లను ప్రవేశపెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎంతమంది రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని వారు ప్రశ్నిస్తున్నారు.