Mamata Banerjee | ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి విలువ లేదు.. వాటిని ఇంట్లో తయారు చేశారు: మమతా బెనర్జీ
Mamata Banerjee | ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి విలువ లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రెండు నెలల ముందుగానే వాటిని ఇంట్లో తయారు చేశారని ఆమె విమర్శించారు.
కోల్‌కతా: ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి విలువ లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. రెండు నెలల ముందుగానే వాటిని ఇంట్లో తయారు చేశారని ఆమె విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఈసారి బెంగాల్లో టీఎంసీ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం దీనిపై స్పందించారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఎగ్జిట్ పోల్స్ లేవని అన్నారు. విలువ లేని ఇలాంటి ఎగ్జిట్ పోల్స్‌ను పత్రికలు చూపిస్తున్నాయని విమర్శించారు. ‘2016, 2019, 2021లో ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహించారో మనం చూశాం. అంచనాలు ఏవీ నిజం కాలేదు’ అని ఒక టీవీ ఛానెల్‌తో అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను మీడియా కోసం కొందరు వ్యక్తులు రెండు నెలల కిందట ఇంట్లో తయారు చేశారని ఆమె ఆరోపించారు. అందుకే వాటికి ఎలాంటి విలువ లేదని అన్నారు.
కాగా, తన ఎన్నికల సభలకు వచ్చిన ప్రజా స్పందనను ఎగ్జిట్ పోల్స్ ధృవీకరించ లేకపోయాయని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాను ముస్లింలు తీసుకుంటున్నారని బీజేపీ తప్పుడు ప్రచారం చేసిందని ఆమె విమర్శించారు. ముస్లింలు బీజేపీకి ఓటు వేస్తారని తాను అనుకోనని అన్నారు. అలాగే బెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు బీజేపీకి సహకరించాయని మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

