Haryana: భూవివాదం.. అయిదుగురు కుటుంబ సభ్యుల్ని గొంతుకోసి చంపిన మాజీ సైనికుడు
Haryana: ఓ మాజీ సైనికుడు.. తన కుటుంబానికి చెందిన అయిదుగుర్ని గొంతుకోసి చంపాడు. ఈ ఘటన హర్యానాలో జరిగింది. రెండు ఎకరాల భూమి కోసం అతను ఆ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అంబాలా: హర్యానా(Haryana)లోని నారాయణ్ఘర్లో దారుణం జరిగింది. రాతౌర్ గ్రామంలో ఓ మాజీ సైనికుడు .. అయిదుగురు కుటుంబసభ్యులను చంపేశాడు. ఆదివారం రాత్రి ఆ మాజీ సైనికుడు.. పదునైన ఆయుధంతో గొంతు గోసి మరీ హత్య చేశాడు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆ సైనికుడి తల్లి, సోదరుడు, వదిన, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నిందితుడు భూషణ్.. తండ్రి ఓం ప్రకాశ్‌పై కూడా అటాక్ చేశాడు. సోదరుడికి చెందిన మరో కూతురిపై కూడా దాడి చేశాడు.
గాయపడ్డవారిని నారాయణ్ఘర్లోని సవిల్ ఆస్పత్రిలో చేర్పించారు. బాధిత వ్యక్తి కూతురికి.. చండీఘడ్‌లోని జీఎంసీహెచ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబసభ్యుల్ని చంపిన తర్వాత.. ఆ మృతదేహాలను రహస్యంగా దహనం చేయాలని నిందితుడు ప్రయత్నించాడు. అయితే పోలీసులు ఆ ప్రాంతాన్ని వెళ్లి, సగం కాలిన మృతదేహాలను రికవరీ చేశారు. రిటైర్డ్ సైనికుడు అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా, పోలీసులు అతన్ని రౌండప్ చేశారు.
సమాచారం అందుకున్న ఎస్పీ సురేంద్ర సింగ్ భౌరియా.. ఆ స్పాట్‌కు తెల్లవారుజామున 3 గంటలకు చేరుకున్నాడు. ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టారు. సగం కాలిన మృతదేహాలను అంబాలా కంటోన్మెంట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. రెండు ఎకరాల స్థలం వివాదం నేపథ్యంలో అటాక్ జరిగినట్లు నిందితుడి తండ్రి ఓం ప్రకాశ్ తెలిపాడు.
బాధితుల్లో 35 ఏళ్ల హరీశ్, 32 ఏళ్ల సోనియా, 65 ఏళ్ల సరోపి, అయిదేళ్ల అమ్మాయి, ఆర్నెల్ల పిల్లోడు ఉన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

