న్యూఢిల్లీ: రాజ్యసభ నూతన సెక్రెటరీ జనరల్‌గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) మాజీ ఛైర్మన్ పీసీ మోదీ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతకం చేశారు. దాంతో ఈ రోజే పీసీ మోదీ రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పీపీకే రామాచార్యులును రాజ్యసభ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
రామాచార్యులును గత సెప్టెంబర్ 1ననే రాజ్యసభ నూతన సెక్రెటరీ జనరల్‌గా నియమించారు. ఆయనను నియమించి రెండు నెలల 15 రోజులైనా కాకముందే పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కొద్ది రోజుల ముందు పీసీ మోదీని ఆయన స్థానంలోకి తీసుకొచ్చారు. ఈ హఠాత్పరిణామం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.