మీరట్: బీఎస్పీ మాజీ ఎంపీ షాహిద్ అక్లాక్ కుమారుడు దనిష్(Danish Akhlaq)ను ఓ రేప్ కేసులో అరెస్టు చేశారు. పర్తాపూర్ పోలీసు స్టేషన్లో అతనిపై సెక్షన్ 376 కింద కేసు బుక్ అయ్యింది. విచారణలో భాగంగా ఎంపీ కుమారుడి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హోటల్ వద్ద జరిగిన ఘటనకు చెందిన సీసీటీవీ కెమెరా దృశ్యాలను కూడా సీజ్ చేశారు. హోటల్‌కు రమ్మని పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 24 ఏళ్ల అమ్మాయి తెలిపింది. ఎంపీ సాహిద్ 2004 నుంచి 2009 వరకు మీరట్ ఎంపీగా చేశారు. తమ కుమారున్ని హనీ ట్రాప్ చేశారని ఆ ఎంపీ ఆరోపించారు. దనిష్తో జరిగిన ఫేస్బుక్, ఇన్‌స్టా చాట్లను బాధితురాలు పోలీసులకు షేర్ చేసింది. తాను బ్యాచలర్ను అని, తనను పెళ్లి చేసుకుంటానని దనిష్ ప్రామిస్ చేసినట్లు ఆమె వెల్లడించింది. ఆగస్టు 20వ తేదీన దనిష్ ఢిల్లీ వెళ్లాఆడు. హౌజ్ ఖాస్ రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. ఆ తర్వాత మీరట్‌లో మంగళవారం ఇద్దరూ కలుసుకున్నారు. దనిష్ ఓ వీడియోను తీసి బెదిరిస్తున్నాడని, ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాడని ఆ బాధితురాలు పోలీసులకు చెప్పింది.