కుమారులను చంపి.. భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మాజీ కార్పొరేటర్
ఈ సంఘటనకు ముందు సంజీవ్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. ‘శత్రువుల పిల్లలకైనా ఈ వ్యాధి రాకుండా దేవుడు చూడాలి. నా పిల్లలను నేను కాపాడుకోలేను. ఇక నేను జీవించాలనుకోవడంలేదు’ అని అందులో పేర్కొన్నాడు.
భోపాల్: కుమారులను చంపిన బీజేపీ మాజీ కార్పొరేటర్, భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్‌లోని విదీషా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విదీషాకు చెందిన 45 ఏళ్ల సంజీవ్ మిశ్రా బీజేపీ మాజీ కార్పొరేటర్. వారి ఇద్దరు కుమారులైన 13 ఏళ్ల అన్మోల్, 7 ఏళ్ల సార్థక్ కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుమారుల అనారోగ్యం గురించి కొంతకాలంగా భార్యాభర్తలు కలత చెందుతున్నారు. దీంతో గురువారం సాయంత్రం సంజీవ్ మిశ్రా, 42 ఏళ్ల భార్య నీలం కఠిన నిర్ణయం తీసుకున్నారు. తొలుత తమ పిల్లలిద్దరిని చంపారు. అనంతరం ఆ దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాగా, ఈ సంఘటనకు ముందు సంజీవ్ మిశ్రా ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. ‘శత్రువుల పిల్లలకైనా ఈ వ్యాధి రాకుండా దేవుడు చూడాలి. నా పిల్లలను నేను కాపాడుకోలేను. ఇక నేను జీవించాలనుకోవడంలేదు’ అని అందులో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ చూసిన కొందరు పోలీసులను అలెర్ట్ చేశారు. దీంతో విదీషా సివిల్ లైన్స్ పోలీసులు వెంటనే సంజీవ్ మిశ్రా ఇంటికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న సంజీవ్ మిశ్రా, ఆయన భార్య, ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ నలుగురు చనిపోయారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

