EWS benefits | ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాళ్లకు మాత్రమేనా.. కేంద్రానికి మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు
EWS benefits | ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ కులాల వారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా..? అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
EWS benefits: ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ కులాల వారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా..? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని ‘అడ్వకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్’ సంస్థ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఆ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేవలం జనరల్ కేటగిరీ అభ్యర్థులకే వర్తిస్తాయా..? లేదంటే ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా వర్తిస్తాయా..? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ చీఫ్ జస్టిస్ రవి విజయమలిమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఆరు వారాల్లో స్పందనను తెలియజేయాలని ఆదేశించింది.
కాగా, ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని, పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, ఈ రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టి వేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

