Upendra Dwivedi | అమెరికా అధ్యక్షుడు ఎప్పుడేం చేస్తాడో ఆయనకే తెలియదనుకుంటా : ఉపేంద్ర ద్వివేది
Upendra Dwivedi | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియకపోవచ్చునని ఇండియన్ ఆర్మీ చీఫ్ (Indian Army chief) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చితులు, భద్రతా సవాళ్లను ఎదుర్కొనేలా నిరంతరం సైన్యం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
Upendra Dwivedi : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియకపోవచ్చునని ఇండియన్ ఆర్మీ చీఫ్ (Indian Army chief) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చితులు, భద్రతా సవాళ్లను ఎదుర్కొనేలా నిరంతరం సైన్యం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, పాత సమస్యలను పరిష్కరించుకునేలోపే కొత్తవి వస్తున్నాయని ఆర్మీ చీఫ్ అన్నారు. ప్రపంచ దేశాల మధ్య ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ ఏం చేస్తున్నారు..? రేపు ఏం చేయబోతున్నారు..? అనే విషయం ఆయనకే తెలియకపోవచ్చునని వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్లో ఓ కార్యక్రమానికి ద్వివేది హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వ్యతిరేక భావజాలం, భూభాగాల స్వాధీనం కోసం చేసే యుద్ధాలు అందరి కళ్లకు కనిపించేవని, ప్రస్తుతం కొత్త వ్యూహాలతో దేశాలు పరస్పరం యుద్ధ వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాయని చెప్పారు. ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ దాడులు, తప్పుడు ప్రచారాల వంటి సవాళ్లను మన సైన్యం ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో తాము కేవలం పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, అయితే ఆ దేశ పౌరులపైనా దాడులకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయని ద్వివేది తెలిపారు. ఇలాంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాలంటే సైన్యం ఆయుధపరంగానే కాకుండా టెక్నాలజీ పరంగానూ మరింత ముందుకు వెళ్లాలన్నారు.
ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆధునిక ఘర్షణలను ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమవుతుందని ద్వివేది తెలిపారు. ఇందుకోసం త్రివిధ దళాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధాలను ఆపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ గొప్పలు చెప్పుకోవడం, ప్రపంచ దేశాలపై ఇష్టానుసారం సుంకాలు విధించడం వంటి చర్యల నేపథ్యంలో ద్వివేది ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

