మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 11:57:15

ఫ్యాష‌న్ డిజైన్ ష‌ర్బ‌రీ ద‌త్తా గుండెపోటుతో మృతి

ఫ్యాష‌న్ డిజైన్ ష‌ర్బ‌రీ ద‌త్తా గుండెపోటుతో మృతి

కోల్‌క‌తా: ప‌్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌‌ర్ ష‌ర్బ‌రీ ద‌త్తా మృతిచెందారు. కోల్‌క‌తాలోని త‌న నివాసంలో గుండెపోటుతో మ‌ర‌ణించార‌ని ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు. 63 ఏండ్ల ష‌ర్బ‌రీ ద‌త్తా కోల్‌క‌తాలోని బ్రాడ్ స్ట్రీట్‌లోని త‌న ఇంట్లో ఒంట‌రిగా ఉంటున్నార‌ని, గురువారం సాయంత్రం వాష్‌రూమ్‌కు వెళ్లిన ఆమె గుండెపోటుతో మ‌ర‌ణించార‌ని కుటుంబ వ‌ర్గాలు తెలిపాయి. 

ఈరోజు ఉద‌యం ఆమెకు ఫోన్ చేయ‌గా లిఫ్ట్ చేయ‌లేద‌ని, దీంతో ఇంటికి వెళ్లి చూస్తే బాత్‌రూమ్‌లో విగ‌త‌జీవిగా ప‌డి ఉన్నార‌ని వెల్ల‌డించారు. ఆమె మ‌ర‌ణానికి కార‌ణం గుండెపోటేన‌ని వైద్యులు నిర్ధారించారు, అయితే ఆమె వాష్‌రూమ్‌లో ప‌డి ఉండ‌టంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపినట్లు వెల్ల‌డించారు.  

ప్రముఖ బెంగాలీ కవి అజిత్ దత్తా కుమార్తె అయిన ష‌ర్బ‌రీ కాలేజీ రోజుల నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌పై మ‌క్కువ పెంచుకున్నారు. మెన్స్ ఫ్యాన్ డిజైనింగ్‌లో ఆమె త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. త‌ర్వాత మ‌హిళ‌ల ఫ్యాష‌న్ డిజైనింగ్‌లోకి ప్ర‌వేశించారు. అనంత‌రం ఆమె తన సొంత బ్రాండ్ షున్యాను ప్రారంభించారు. ఈ బ్రాండ్‌తో కోల్‌‌కతాలో ఔట్‌లెట్లను ఏర్పాటుచేశారు. 

ఆమె మృతిపై ప‌లువురు న‌టులు సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. 


logo