జార్గ్రామ్: రామ్‌లాల్ అక్కడ చాలా ఫేమస్. పశ్చిమ బెంగాల్(West Bengal)లోని జార్గ్రామ్ అడవుల్లో ఆ ఏనుగు అంటే అందరికీ సుపరిచతమే. కానీ గురువారం ఆ ఐరావతం అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఓటర్ల కన్నా ముందే పోలింగ్ బూత్ చేరుకున్నది. పొద్దుపొద్దునే స్థానిక ప్రజల్ని థ్రిల్ చేసింది. ఇవాళ బెంగాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. జార్గ్రామ్లోని జిట్సోల్ ప్రైమరీ స్కూల్ వద్దకు రామ్‌లాల్ ఏనుగు వచ్చింది. తెల్లవారుజామున పోలింగ్ సిబ్బంది బూత్‌లో సెటిల్ అవుతన్న సమయంలో.. ఇంకా అక్కడికి పెద్దగా ఓటర్లు రాక ముందే రామ్‌లాల్ చేరుకున్నది. ఆ బూత్ ముందున్న ఎన్నికల వాహనాన్ని కూడా అది తనిఖీ చేసింది. అయితే ఓటింగ్ కోసం బూత్‌కు వచ్చే ఓటర్లు అంతా రామ్‌లాల్‌ను చూసి షాకయ్యారు. జంగల్‌మహల్ అడవుల్లో తిరిగే రామ్‌లాల్ … తెల్లవారగానే పోలింగ్ బూత్ వద్దకు రావడంతో కొంత ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న లోధాశులి అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ టస్కర్‌ను సైలెంట్‌గా పంపించేశారు. రామ్‌లాల్ ఏనుగు అక్కడ నుంచి వెళ్లిపోగానే మళ్లీ పోలింగ్ సజావుగా సాగింది.
జంగల్‌మహల్ ఏరియాలో ఏనుగుల సంచారం ఎక్కువే. ఆ సమస్యను గుర్తించే.. అధికారులు వివిధ రకాల ఏర్పాట్లు చేశారు. ఎలిఫెంట్ ట్రాకర్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఐరావత్ వెహికల్ సర్వీస్ కూడా సిద్ధం చేశారు. ఇక రామ్‌లాల్ ఏనుగు స్థానికులకు సుపరిచితమే. జార్గ్రామ్, పశ్చిమ్ మిద్నాపూర్, బంకురాతో పాటు ఒడిశా, జార్ఖండ్ ఏరియాలో ఇది ఎక్కువగా సంచరిస్తుంది. గ్రామస్థులు ఈ ఏనుగు వచ్చినప్పుడు దానికి వరి, పండ్లు, కూరగాయలు ఇస్తుంటారు.
STORY | ‘Ramlal’ joins poll queue: Elephant’s early morning visit adds twist to Bengal polls
In an election where numbers, narratives and nerves are being closely tracked, it was an unlikely “voter” – a wandering elephant named ‘Ramlal’ – that briefly stole the poll spotlight in… https://t.co/SqIIgrA6LQ
— Press Trust of India (@PTI_News) April 23, 2026