కరెంట్‌తో డీఎన్ఏను మార్చి.. రోగాన్ని పోగొట్టి
ఒకప్పుడు కాలక్షేపం కోసం ఉపయోగపడ్డ ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఇప్పుడు మన ఆరోగ్య పరిరక్షణ సాధనాలుగా మారిపోయాయి. బీపీ, గుండె వేగం కొలవడం, వాకింగ్ చేసేటప్పుడు ఎన్ని అడుగులు వేశాం తదితర అనేక అంశాలను ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైజ్‌లు మనకు తెలియజేస్తున్నాయి.
జ్యూరిచ్ : ఒకప్పుడు కాలక్షేపం కోసం ఉపయోగపడ్డ ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఇప్పుడు మన ఆరోగ్య పరిరక్షణ సాధనాలుగా మారిపోయాయి. బీపీ, గుండె వేగం కొలవడం, వాకింగ్ చేసేటప్పుడు ఎన్ని అడుగులు వేశాం తదితర అనేక అంశాలను ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైజ్‌లు మనకు తెలియజేస్తున్నాయి. రానున్న కాలంలో శరీరంలో సమస్యను గుర్తించడంతో పాటు చికిత్సను సైతం చేయనున్నాయి. డీఎన్ఏను ప్రభావితం చేయనున్నాయి. ఉదాహరణకు డయాబెటిక్ పేషెంట్ శరీరంలోనే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసి వారికి ఉపశమనం కలిగించడం తరహా చికిత్సలను రానున్న కాలంలో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు చేస్తాయి. దీనిపై స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.
కణాలు ప్రేరేపితమై
సాధారణంగా ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ప్రత్యక్షంగా మన శరీరంలో ఉన్న రోగాన్ని నయం చేయలేవు. శరీరానికి డివైజ్‌కు మధ్య ఎలక్ట్రోజెనెటిక్ ఇంటర్ఫేస్ లేకపోవడమే దీనికి కారణం. ప్రస్తుతం జ్యూరిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి సారించారు. పరిశోధనలో భాగంగా టైప్-1 డయాబెటిక్‌తో బాధపడుతున్న ఎలుకలపై వారు ప్రయోగాలు నిర్వహించారు. మానవుల్లో ఉండే పాంక్రియాటిక్ కణాలను ఎలుకల్లో ప్రవేశపెట్టారు. ఆంక్యుపంక్చర్ సూదుల ద్వారా కరెంట్‌ను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ కణాలు ప్రేరేపితమయ్యేలా చేశారు. ఈ చర్యల వల్ల ప్రేరేపితమై డీఎన్ఏ మార్పులకు లోనయ్యేటట్టు చేస్తాయి. రోగం నయం అయ్యేందుకు ఉపయోగపడే ఎలక్ట్రానిక్ డివైజ్‌ను వారు అభివృద్ధి చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

