ఐరోపాలో విద్యుత్తు సంక్షోభం
- విద్యుత్తు కొరతతో సతమతం
- తీవ్ర ఎండలతో పెరిగిన డిమాండ్
- తగ్గిన గ్యాస్ దిగుమతులు
- డిమాండ్‌కు సరిపడా లేని ఉత్పత్తి
- రష్యాపై ఆధారపడాల్సిన పరిస్థితి
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో గ్యాస్ సరఫరాలో అవాంతరాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ‘దేశ ప్రజలు అధిక బిల్లులతో ఇబ్బంది పడకుండా చూడటంతో పాటు దేశంలో విద్యుత్తు సంక్షోభం లేకుండా చర్యలు తీసుకుంటా’ ఇదీ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తన తొలి ప్రసంగంలో లిజ్ ట్రస్ చేసిన వ్యాఖ్యలు ఇవి. బ్రిటన్‌లో విద్యుత్తు సంక్షోభం ఎంతలా ఉందో ఆమె మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
అయితే బ్రిటన్ మాత్రమే కాదు ఐరోపా మొత్తం కూడా విద్యుత్తు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. భారీ గ్యాస్ ధరలు, కరెంటు కోతలు, భారీ బిల్లులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరతతో ఐరోపా దేశాలు సతమతమవుతున్నాయి. ఎండలతో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరిగింది. గ్యాస్ ధర కూడా గత ఏడాదితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. రష్యా నుంచి సరఫరా ఆగిపోవడం కూడా ఈ సంక్షోభానికి మరొక కారణం.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో దుర్భరంగా..
ఉద్గారాలను తగ్గించే దిశగా ఐరోపా చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను మూసేస్తున్నది. పునరుత్పాదక శక్తిపై ఎక్కువగా ఆధారపడుతున్నది. సౌర, పవన విద్యుత్తు తయారీలో చాలా ఇబ్బందులు తలెత్తుతుండటంతో డిమాండ్‌కు తగ్గట్టు సరిపోవట్లేదు. ఉత్తర సముద్ర ప్రాంతంలోని చమురు, గ్యాస్ నిక్షేపాల్లో సరైన నిర్వహణ లేకపోవడం కూడా గ్యాస్ సరఫరా పడిపోవడానికి కారణం. గ్యాస్ ధరలు జూలై నుంచి రోజు రోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ కొనుగోలు ఐరోపా దేశాలకు సవాలుగా మారింది. రానున్న చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని జపాన్, చైనాలు భారీ మొత్తంలో గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి.
దీంతో ఐరోపాకు గ్యాస్ లభించడం కష్టమవుతున్నది. బాల్టిక్ సముద్రం కింద రష్యా నుంచి జర్మనీ వరకు గ్యాస్ సరఫరా చేసే పైప్‌లైన్ ప్రాజెక్టు కోసం 11 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఆంక్షల కారణంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. అమెరికా నుంచి కాస్తోకూస్తో గ్యాస్ దిగుమతి అవుతున్నా.. అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఫ్రాన్స్ అణు విద్యుత్తు సరఫరా కూడా 30 శాతం మేర తగ్గింది.
జర్మనీ అయితే అణు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను పూర్తిగా మూసేయనున్నట్టు ప్రకటించింది. పైగా గ్యాస్ ఎగుమతులను పెంచే యోచన రష్యాకు లేకపోవడంతో ఐరోపాలో విద్యుత్తు కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నది. ఇక ఈ సంక్షోభం 2025 దాకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పటికి అమెరికాలోని గ్యాస్ ఉత్పత్తి ప్రాజెక్టులు పూర్తయి, సరఫరా పెరిగే అవకాశం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

