Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలు అందించిన ఎస్బీఐ.. ‘సుప్రీం’లో అఫిడవిట్..!
Electoral Bonds | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సీరియల్ నంబర్లతో సహా ఈసీకి అప్పగించింది.
Electoral Bonds | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సీరియల్ నంబర్లతో సహా ఈసీకి అప్పగించింది. సీరియల్ నంబర్లు బాండ్లను ఎన్‌క్యాష్ చేసిన పార్టీల వివరాలతో సరిపోల్చేందుకు సహాయపడనున్నది. త్వరలో ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో సమాచారాన్ని పబ్లిక్‌గా అప్డేట్ చేయనున్నది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
కోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఎస్బీఐ వెల్లడించింది. ఇంతకు ముందు ఎస్బీఐపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్ల డేటాను మార్చి 21లోగా అందజేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 15న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆల్ఫా న్యూమరిక్ నంబర్లతో సహా పూర్తి వివరాలను వెల్లడించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఎస్బీఐ అందించిన డేటాను వైబ్సైట్లో పబ్లిష్ చేయాలని ఈసీకి సూచించింది.
ఆల్ఫా న్యూమరిక్, సీరియల్ నెంబర్స్ లేకపోవడంతో సుప్రీంకోర్టు బాండ్ల వివరాల వెల్లడిలో ‘సెలక్టివ్’ విధానాన్ని మానుకోవాలని.. ఈ నెల 21లోగా ఏ దాత, ఏ రాజకీయ పార్టీకి బాండ్ల రూపంలో ఎంత విరాళం ఇచ్చారనేది తెలియజేసే యునిక్ బాండ్ నంబర్లతో సహా ఈసీకి పూర్తి వివరాలు సమర్పించాల్సిందేనని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎస్బీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యునిక్ నంబర్లతో సహా అన్ని వివరాలు అందజేసినట్లుగా 21న సాయంత్రం 5 గంటల్లోగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని ఎస్బీఐ ఎండీని ఆదేశించింది. వివరాలు అందిన వెంటనే వివరాలను అప్డేట్ చేయాలని ఈసీకి సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

