Lok Sabha Elections | నాలుగో విడతలో 64 శాతం పోలింగ్.. బెంగాల్లో అత్యధికం
నాలుగో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయానికి 64.05 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లో అత్యల్పంగా 37.93 శాతం, పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 75.56 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపింది.
- తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ర్టాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు
- బెంగాల్లో అత్యధికంగా 75.6%, జమ్ముకశ్మీర్‌లో అత్యల్పంగా 37.9%
Lok Sabha Elections | న్యూఢిల్లీ: నాలుగో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయానికి 64.05 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లో అత్యల్పంగా 37.93 శాతం, పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 75.56 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపింది. ఏపీలో 72 శాతం, బీహార్‌లో 56.75%, జార్ఖండ్‌లో 64.59%, మధ్యప్రదేశ్‌లో 71.72%, మహారాష్ట్రలో 57.58%, ఒడిశాలో 64.81%, తెలంగాణలో 64%, ఉత్తరప్రదేశ్‌లో 58.05 శాతం పోలింగ్ నమోదైనట్టు వెల్లడించింది.
బెంగాల్, ఏపీలో ఘర్షణలు
పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఏపీలో అధికార వైస్సార్సీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. ముఖ్యంగా పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వేమూరు నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్‌లను టీడీపీ నేతలు నియంత్రణలోకి తీసుకున్నారని వైసీపీ ఆరోపించింది. కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ అధికారి టీడీపీతో కుమ్మక్కై రిగ్గింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నది. తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ ఓ ఓటరుపై చేయిచేసుకోవడం వివాదానికి దారితీసింది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నాయకుల కార్లు ధ్వంసమయ్యాయి. చిత్తూరు గుడిపాల మండలంలో తమ పార్టీ ఏజెంట్‌ను పొడిచారని వైసీపీ ఆరోపించింది. రెంటచింతల మండలంలో తమ పార్టీ శ్రేణులపై వైసీపీ దాడులకు దిగిందని టీడీపీ ఎమ్మెల్సీ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్, బీజేపీ నేతల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బర్ధమన్-దుర్గాపూర్ బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై రెండు చోట్ల రాళ్లదాడి జరిగింది. బీర్భూమ్, క్రిష్ణానగర్ నియోజకవర్గాల్లోనూ రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణలు జరిగాయి. మరోవైపు, సరైన రోడ్లు, అభివృద్ధి లేదని నిరసిస్తూ ఉత్తరప్రదేశ్‌లో పలు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు.
379 స్థానాలకు ఎన్నికలు పూర్తి
నాలుగో విడతలో భాగంగా తెలంగాణలో 17, ఏపీలో 25, యూపీలో 13, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమబెంగాల్లో 8, జమ్ముకశ్మీర్‌లో ఓ స్థానానికి ఎన్నికలు జరిగాయి. నాలుగో విడతతో కలిపి ఇప్పటివరకు 379 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. తక్కిన మూడు దశల ఎన్నికలు మే 20, మే 25, జూన్ 1న జరుగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టునున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

