Rajasthan polls | రాజస్థాన్‌లో రూ.200 కోట్లకుపైగా ఎన్నికల ‘ఉచితాలు’ స్వాధీనం
Rajasthan polls | రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Rajasthan polls) నవంబర్ 25న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మూడు వారాల్లో సుమారు రూ.200 కోట్లకుపైగా ఎన్నికల ఉచితాలకు సంబంధించిన డబ్బు, మద్యం, బంగారు ఆభరణాలు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Rajasthan polls) నవంబర్ 25న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మూడు వారాల్లో సుమారు రూ.200 కోట్లకుపైగా ఎన్నికల ఉచితాలకు సంబంధించిన డబ్బు, మద్యం, బంగారు ఆభరణాలు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి రాజస్థాన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐజీ వికాస్ కుమార్ నేతృత్వంలో 12 మంది అధికారుల బృందాలతో ‘స్టోర్మ్ క్లబ్’ను ఏర్పాటు చేశారు.
కాగా, రాజస్థాన్ వ్యాప్తంగా ఎన్నికలపై కట్టుదిట్టమైన నిఘా, ఎన్నికల ప్రచారంలో ఓటర్లు ప్రభావితం కాకుండా చూసేందుకు ఈ పోలీస్ బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు రూ. 214 కోట్ల మేర ఎన్నికల ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇందులో రూ. 25 కోట్ల డబ్బు, రూ. 20 కోట్ల విలువైన మద్యం, రూ.20 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయని అన్నారు. వీటికి సంబంధించి పలు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు రూ.60 కోట్ల విలువైన డ్రగ్స్, అలాగే అక్రమంగా నిల్వ చేసిన ఆయుధాలు, పెట్రోల్, డీజిల్, ఎరువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ తెలిపారు. ఆపరేషన్ మోనాకో కింద రాజస్థాన్ వ్యాప్తంగా 650 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. పెద్ద సంఖ్యలో ఎన్నికల తాయిలాలను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. వారికి రివార్డులు కూడా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

