17 రాష్ర్టాల్లో ఎస్ఎస్ఆర్
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాతో సహా మొత్తం 17 రాష్ర్టాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సమీక్ష(స్పెషల్ సమ్మరీ రివిజన్-ఎస్ఎస్ఆర్)ను చేపట్టనున్నట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆయా రాష్ర్టాలకు తెలియచేసింది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ర్టాలతో సహా సంబంధిత రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు రాసిన లేఖలో ఈ ప్రక్రియ కోసం 2027 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా నిర్ణయించినట్టు ఈసీఐ పేర్కొంది.
- ‘సర్’ వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్ణయం
- 2027 జనవరి 1 అర్హత తేదీ
- మొదటిసారి ఓటు వేసేవారిని చేర్చడమే ముఖ్య ఉద్దేశం
న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాతో సహా మొత్తం 17 రాష్ర్టాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సమీక్ష(స్పెషల్ సమ్మరీ రివిజన్-ఎస్ఎస్ఆర్)ను చేపట్టనున్నట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆయా రాష్ర్టాలకు తెలియచేసింది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ర్టాలతో సహా సంబంధిత రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు రాసిన లేఖలో ఈ ప్రక్రియ కోసం 2027 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా నిర్ణయించినట్టు ఈసీఐ పేర్కొంది.
అర్హులైన ఓటర్లను, ముఖ్యంగా యువతను, మొదటిసారి ఓటు వేసేవారిని చేర్చడం, ఇప్పటికే ఉన్న నమోదుల్లోని తప్పులను సరిదిద్దడం, ఓటర్ల జాబితాలు కచ్చితంగా, తాజాగా ఉండేలా చూసుకోవడం ఎస్ఎస్ఆర్ ముఖ్య ఉద్దేశం. 403 మంది సభ్యులున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది మే 22న ముగియనున్నది. మణిపూర్(60 మంది సభ్యులు), గోవా(40), పంజాబ్(117), ఉత్తరాఖండ్(70) రాష్ర్టాల అసెంబ్లీల పదవీకాలాలు వచ్చే ఏడాది మార్చి నెలలో వేర్వేరు తేదీల్లో ముగియనున్నాయి.
సర్‌కు ఎస్ఎస్ఆర్కు తేడా
ఎస్ఎస్ఆర్ కొత్త అర్హులపై, సాధారణ సవరణలపై దృష్టి సారిస్తుండగా సర్ మరింత లోతుగా వెళుతుంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ధృవీకరణ, ఎంట్రీ వివరణాత్మక పరిశీలన, పెద్ద ఎత్తున డాటా ఆడిట్లు ఉంటాయి. ఉదాహరణకు ఎస్ఎస్ఆర్ కింద ఇల్లు మారిన ఓటరు తమ చిరునామాను అప్డేట్ చేయడానికి ఒక ఫామ్‌ను దాఖలు చేయాలి. సర్ కింద బూత్ స్థాయి అధికారి ఆ చిరునామాకు వెళ్లి ఓటరు ఇంకా అక్కడే నివసిస్తున్నారో లేదో నిర్ధారించుకుని, కొత్తగా ఎవరైనా అర్హులయ్యారో లేదో తనిఖీ చేసి ఓటరు స్వయంగా మార్పును ప్రారంభించే వరకు వేచి ఉండకుండా భౌతిక ధృవీకరణ ఆధారంగా ఓటర్ల జాబితాను అప్డేట్ చేస్తారు.
ఎన్నికల్లో అక్రమాలపై ఈసీకి నోటీసులు
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని విపక్ష నేత రాహుల్ గాంధీ, మరికొంతమంది దాఖలు చేసన పిటిషన్లపై ప్రతిస్పందన కోరుతూ సుప్రీంకోర్టు గురువారం భారత ఎన్నికల సంఘం, ముగ్గురు కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం పనితీరుపై, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ రాహుల్ గాంధీ, మరో 12 మంది ఇండియా కూటమి నేతలు ఈ పిటిషన్ వేశారు.
జంతర్ మంతర్‌పై కేంద్రానికి..
జంతర్ మంతర్‌ను నిరసన వేదికగా తొలగించడంపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని ఆదేశించింది. జంతర్‌మంతర్‌ను తొలగించడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది స్వాతిసింగ్ వేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. గతంలో తమ ఆదేశాల ఆధారంగానే తొలగించారా లేదా స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారా అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఒక ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

