Sachin Tendulkar: నేషనల్ ఐకాన్‌గా సచిన్ టెండూల్కర్.. ఎన్నికల సంఘంతో ఒప్పందం
Sachin Tendulkar: యువ ఓటర్ల చైతన్యం కల్పించేందుకు సచిన్ టెండూల్కర్‌తో రేపు ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనున్నది. మూడేళ్ల పాటు సచిన్ ప్రజల్లో ఓటింగ్‌పై ప్రచారం నిర్వహిస్తారు. నేషనల్ ఐకాన్‌గా అతన్ని ఈసీ గుర్తించనున్నది.
న్యూఢిల్లీ: లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)తో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సచిన్‌ను నేషనల్ ఐకాన్‌గా ఈసీ నియమించనున్నది. బుధవారం దీనిపై ఒప్పందం కుదరనున్నది. రాబోయే ఎన్నికల్లో యువతకు ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు సచిన్ పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా సచిన్ ఓటర్ల చైతన్య ప్రచారం నిర్వహిస్తారని ఈసీ తెలిపింది. అనేక రంగాలకు చెందిన మేటి వ్యక్తుల్ని నేషనల్ ఐకాన్స్‌గా ఈసీ తమ ప్రచారం కోసం నియమించుకుంటోంది. గతంలో పంకజ్ త్రిపాఠి, ఎంఎస్ ధోనీ, ఆమిర్ ఖాన్, మేరీ కోమ్‌లను కూడా ఎన్నికల ప్రచారం కోసం ఈసీ వాడుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

