Viral news | ‘మేం నడిచే బాటలో నడుస్తార్రా’.. దళిత పిల్లలను అడ్డుకున్న వృద్ధురాలు.. కేసు నమోదు
Viral news | దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా అంటరానితనం లాంటి అనాగరిక రుగ్మతలు ఇంకా పూర్తిగా రూపుమాయడం లేదు. ఇంకా చాలామంది దళితులను అంటరానివాళ్లుగా చూస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రం తంజావూరు తాలూకాలోని కొల్లంగరై గ్రామంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Viral news : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా అంటరానితనం లాంటి అనాగరిక రుగ్మతలు ఇంకా పూర్తిగా రూపుమాయడం లేదు. ఇంకా చాలామంది దళితులను అంటరానివాళ్లుగా చూస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రం తంజావూరు తాలూకాలోని కొల్లంగరై గ్రామంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
స్కూల్ నుంచి ఇళ్లకు వెళ్తున్న దళిత విద్యార్థులను మార్గమధ్యలో ఓ వృద్ధ మహిళ అడ్డుకుంది. ‘మేం నడిచే బాటలో అంటరాని కులంలో పుట్టిన మీరు నడుస్తార్రా..?’ అంటూ కట్టెపట్టుకుని అడ్డం తిరిగింది. పిల్లలను వెనక్కి పంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను పిల్లల్లో ఒకరు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వృద్ధురాలి తీరుపై నెటిజన్లలో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్లాలంటే దళితవాడకు చెందిన పిల్లలు చెరువు చుట్టూ తిరిగి ఒకటిన్నర కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. కానీ చెరువు ఇవతలివైపు దారిలో వెళ్తే అర్ధకిలోమీటర్ ప్రయాణంతో ఇళ్లకు చేరుకోవచ్చు. దాంతో బడి వదలగానే దళిత పిల్లలు దగ్గరిదారిలో వెళ్లేందుకు వచ్చారు. కానీ వృద్ధురాలు వారిని అడ్డుకుంది.
వీడియో వైరల్ కావడంతో దళితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. వృద్ధురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయితే వృద్ధురాలిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

