Watch: వృద్ధ దంపతులను ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిపడ్డారు
Car Hits Elderly Couple | రోడ్డు పక్కన నిల్చొన్న వృద్ధ దంపతులను కారు ఢీకొట్టింది. వారి మీదకు దూసుకెళ్లింది. దీంతో ఆ వృద్ధ జంట గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చండీగఢ్: రోడ్డు పక్కన నిల్చొన్న వృద్ధ దంపతులను కారు ఢీకొట్టింది. వారి మీదకు దూసుకెళ్లింది. దీంతో ఆ వృద్ధ జంట గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Car Hits Elderly Couple) పంజాబ్‌లోని ముక్త్సర్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో వృద్ధులైన దంపతులు రోడ్డు దాటేందుకు ఒక పక్కగా నిలబడి ఉన్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఒక కారు వారి మీదకు దూసుకెళ్లింది. దీంతో ఆ వృద్ధ జంట గాల్లోకి ఎగిరి పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఆ కారు అనంతరం ఒక బైక్‌ను కూడా ఢీ కొట్టింది. దీంతో బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన తర్వాత కారును వదలి డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వృద్ధ దంపతులకు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
An elderly couple standing on the roadside in #Punjab's #Muktsar was badly hit by a speeding car.#RoadAccident #RoadSafety #RoadRage pic.twitter.com/k4cDb2z9kY
— Hate Detector 🔍 (@HateDetectors) April 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

