Raod Accident | పెండ్లికి వెళ్లి వస్తుండగా కారు- ట్రాక్టర్ ఢీ.. 8 మంది మృతి
బీహార్లోని కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. పెండ్లి వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారు జాతీయరహదారి 31పై సమేలీ బ్లాక్ ఆఫీస్ సమీపంలో టాక్టర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు.
పాట్నా: బీహార్లోని కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. పెండ్లి వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారు జాతీయరహదారి 31పై సమేలీ బ్లాక్ ఆఫీస్ సమీపంలో టాక్టర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
బాధితులంతా సుపౌల్కు చెందినవారని, వివాహ వేడుకకు హాజరై తిరిగి సొంతూరుకు వస్తుండగా ప్రమాదం జరిగిందని కటిహార్ ఎస్పీ వైభవ్ శర్మ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

