ED | అలా ఎంపీ టికెట్ ఇలా ఈడీ సమన్లు.. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేతకు షాక్
మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) నేతకు ఈడీ షాక్ ఇచ్చింది. ఉదయం 9 గంటలకు ముంబై ఆగ్నేయ లోక్‌సభ అభ్యర్థిగా అమోల్ కృతికర్ను పార్టీ ప్రకటించగా, 10 గంటలకు కిచిడీ కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వచ్చే బుధవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది.
- అభ్యర్థిత్వం ప్రకటించిన గంటకే తాఖీదు
- కిచిడీ కేసులో అమోల్ కీర్తికర్‌కు నోటీస్
ED | ముంబై, మార్చి 28: మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) నేతకు ఈడీ షాక్ ఇచ్చింది. ఉదయం 9 గంటలకు ముంబై ఆగ్నేయ లోక్‌సభ అభ్యర్థిగా అమోల్ కృతికర్ను పార్టీ ప్రకటించగా, 10 గంటలకు కిచిడీ కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వచ్చే బుధవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. కొవిడ్ సమయంలో వలస కార్మికులకు కిచిడీ పంపిణీకి సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపులో రూ.6.37 కోట్ల అక్రమాలకు పాల్పడినట్టు కేసు నమోదైంది. దీనికి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్‌లో అమోల్‌ను ఆర్థిక నేరాల విభాగం అధికారులు ప్రశ్నించారు.
అనంతరం పీఎంఎల్ఏ కింద ఈడీ కూడా కేసు నమోదు చేసి ఆదిత్య ఠాక్రే సన్నిహితుడైన సూరజ్ చవాన్‌ను అరెస్ట్ చేసింది. ఇప్పుడు అదే కేసులో అమోల్ కృతికర్కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా, విచారణకు హాజరు కావడానికి మరికొంత సమయం ఇవ్వాలని అమోల్ కృతికర్ న్యాయవాది ఈడీ అధికారులను గురువారం కలిసి అభ్యర్థించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

