ED Searches : మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చత్తీస్ఘఢ్ సహా 16 ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. పోకర్, కార్డ్ గేమ్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్, క్రికెట్ వంటి పలు క్రీడలపై అక్రమ గ్యాంబ్లింగ్‌కు పాల్పడిన హైప్రొఫైల్ స్కామ్ మహదేవ్ యాప్ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్‌ను అక్రమంగా మహదేవ్ యాప్ తమ ప్లాట్‌ఫాంపై ప్రసారం చేస్తూ బెట్టింగ్‌లకు పాల్పడిందని వయాకాం 18 నెట్వర్క్ మహారాష్ట్ర సైబర్ విభాగానికి చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించారు. ఇక 2023 అక్టోబర్‌లో ఈ కేసు విషయంలో ర్యాపర్ సింగర్ బాద్షాను మహారాష్ట్ర సైబర్ విభాగం ప్రశ్నించింది.
ఈడీ ఈ కేసులో తొమ్మిదో నిందితుడిని అరెస్ట్ చేసిన రెండు వారాల అనంతరం తాజా సోదాలు జరిగాయి. మహదేవ్ యాప్ ప్రమోటర్లు సౌరవ్ చంద్రార్కర్, రవి ఉప్పల్‌కు సన్నిహితుడిగా పేరొందిన నితీష్ దివాన్‌ను ఫిబ్రవరి 15న అరెస్ట్ చేశారు.
Read More :