Ebola Alert | ఎబోలాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక.. ఇండియాలో ఎబోలా అలర్ట్.. ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్
Ebola Alert : భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. దేశంలో ఎబోలా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. దేశంలోకి ఎబోలా రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
Ebola Alert : ఎబోలా ప్రపంచాన్ని మరోసారి వణికిస్తోంది. ఆఫ్రికాలో ఇటీవల మళ్లీ మొదలైన ఎబోలా అక్కడ క్రమంగా విస్తరిస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగో, ఉగాండాలలో ఎబోలా ప్రమాదకర స్థాయికి చేరడంతో అక్కడ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాపించకుండా చూడాలని, ఆయా దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. దేశంలో ఎబోలా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. దేశంలోకి ఎబోలా రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా విదేశీ ఎంట్రీ పాయింట్స్ వద్ద ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు డీజీహెచ్ఎస్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్) అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి.. ముఖ్యంగా ఎబోలా అత్యధికంగా వ్యాపిస్తున్న కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించింది.
ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైనా ఎబోలా లక్షణాలు ఉంటే వెంటనే వారిని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, రక్తస్రావం వంటివి ఉంటే ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్లకు చెబుతున్నారు. వారిని ప్రత్యేకంగా ఉంచి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య స్తితిపై పర్యవేక్షిస్తున్నారు. అలాగే, ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరికైనా ఇలాంటి అనారోగ్య లక్షణాలు 21 రోజుల్లోపు వస్తే.. వెంటనే తమకు తెలియజేయాలని కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారు ఇటీవలి కాలంలో ఏయే దేశాలు తిరిగారో కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా విదేశాల నుంచి ఇండియాకు ఎబోలా రాకుండా చూస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

