కర్నాటకలో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
బెంగళూరు : కర్నాటకలో మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. గత మూడు రోజుల్లో ప్రకంపనలు రావడం ఇది మూడోసారి. సుల్లియా పరిసర ప్రాంతాల్లో రెండోసారి ప్రకంపనలు రికార్డయ్యాయి. ఇండ భారీ శబ్దంతో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
ప్రకంపనల సమయంలో ఫర్నీచర్, రూఫింగ్ టాప్ షీట్లతో పాటు ఇంట్లో వస్తువులు కదిలాయని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం సుల్లియాతో పాటు పరిసర ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై 2.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. మంగళవారం రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. బెంగళూరుకు 238 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదుకిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. కర్నాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) భూకంపాలను నిశితంగా పరిశీలిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

