Earthquake | హోషియాపూర్ను వణికించిన భూకంపం..!
Earthquake | పంజాబ్ హోషియాపూర్‌లో ఆదివారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు తీశాయి.
Earthquake | పంజాబ్ హోషియాపూర్‌లో ఆదివారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు తీశాయి. సాయంత్రం 4.12 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ప్రమాదం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం సైతం హర్యానాలోని ఝాజ్జర్లోని మహర్నా సమీపంలో భూకంపం సంభవించింది.
భూమికి ఐదుకిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ అంతర్భాగంలో పలు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఒకదాంటో ఒకటి ఢీకొన్న సమయంలో భూ ప్రకంపనలు వస్తాయని భూగర్భశాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ది సిస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం.. భూకంపాలను పలు జోన్లుగా విభజించారు. ఆయా జోన్లను భట్టి ప్రమాదం అంచనా వేస్తున్నారు. హోషియార్పూర్ ప్రాంతం జోన్-4లో ఉన్నది. రెండో జోన్లో తక్కువ ప్రమాదం ఉంటుంది. జోన్-ఐదులో అత్యధిక ప్రమాదం ఉంది. జోన్-2 స్కై బ్లూ, జోన్-3 మూడు యెల్లో, జోన్-ఆరెంజ్, జోన్-5 ఐదు ఎరుపు రంగులో ఉన్నాయి. జోన్-5 అత్యంత ప్రమాదకరంగా భూగర్భ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

