ఢిల్లీలో ఆక్సిజన్ సంక్షోభం.. రోగులను డిశ్చార్జ్ చేస్తున్న హాస్పిటల్స్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నాలుగో దశ అల్లాడిస్తున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఒకవైపు బెడ్స్ లేని పరిస్థితి. మరోవైపు ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్నది. దీంతో కరోనా రోగులకు చికిత్స అందించలేని దీనస్థితి. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక రోగులను డిశ్చార్జ్ చేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లకు చెబుతున్నాయి.
ఢి ల్లీలోని శాంతి ముకాండ్ హాస్పిటల్ సీఈఓ సునీల్ సాగర్, తమ ఆసుపత్రిలో ఆక్సిజన్ సంక్షోభం గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉన్నదని తెలిపారు. కేవలం రెండు గంటల్లో అది కూడా అయిపోతుందని చెప్పారు. ఈ పరిస్థితిలో రోగులు చనిపోతారని, అందుకే వారిని డిశ్చార్జ్ చేయమని వైద్యులను కోరుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
#WATCH | Sunil Saggar, CEO, Shanti Mukand Hospital, Delhi breaks down as he speaks about Oxygen crisis at hospital. Says "…We're hardly left with any oxygen. We've requested doctors to discharge patients, whoever can be discharged…It (Oxygen) may last for 2 hrs or something." pic.twitter.com/U7IDvW4tMG
— ANI (@ANI) April 22, 2021
నోయిడాలోని కైలాష్ హాస్పిటల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొన్నది. మరి కొన్ని గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే తమ వద్ద ఉన్నదని గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రితు బోహ్రా తెలిపారు. గౌతమ్ బుద్ధ నగర్లో తమకు 4 ఆస్పత్రులు ఉన్నాయని, అన్నింట్లోనూ ఆక్సిజన్ సంక్షోభం ఉందన్నారు. 36 గంటల తర్వాత ఆక్సిజన్ సరఫరా అందుతుందని తమకు చెప్పారని, దీంతో కొత్తగా రోగులను చేర్చుకోవడాన్ని నిలిపివేసినట్లు ఆమె వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

