Assam DSP: మైనర్‌పై లైంగిక వేధింపులు.. సీనియర్ పోలీసు అధికారి అరెస్టు
Assam DSP: అస్సాంలో డీఎస్సీపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో అతన్ని అరెస్టు చేశారు. ఇంట్లో పనిచేసే ఓ మైనర్‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆఫీసర్‌ను కిరణ్ నాథ్‌గా గుర్తించారు.
న్యూఢిల్లీ: అస్సాంలో డీఎస్సీ(Assam DSP)పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో అతన్ని అరెస్టు చేశారు. ఇంట్లో పనిచేసే ఓ మైనర్‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆఫీసర్‌ను కిరణ్ నాథ్‌గా గుర్తించారు. గోలాఘాట్ జిల్లాలోని లాచిత్ బోర్పుకాన్ పోలీసు అకాడమీలో పనిచేస్తున్నారు. 15 ఏళ్ల బాధితురాలను ఆ ఆఫీసర్ పదేపదే రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనను ఆ ఆఫీసర్ ఇంట్లో బంధించినట్లు బాధితురాలు చెప్పుకున్నది. కుటుంబసభ్యులతో కలిసి డీఎస్పీ తనను వేధించినట్లు ఆ యువతి పేర్కొన్నది. డేర్గావ్ పోలీసు స్టేషన్లో ఆ అమ్మాయి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఆదివారం కేసు నమోదు చేశారు. విచారణ ద్వారా ఆధారాలను సేకరించి డీఎస్పీ నాథ్‌ను అరెస్టు చేసినట్లు డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఐపీసీలోని 376, 506, పోక్సోలోని సెక్షన్ 6 కింద నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- domestic help
- dsp
- Minor rape
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

