ఓ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. క్యాబ్ డ్రైవర్‌తోపాటు పోలీసులను కూడా తిడుతూ నవీ ముంబై రోడ్డుపై హల్చల్ సృష్టించింది. వీరితోపాటు రోడ్డుపై వెళ్లేవారి వెంట పడి మరీ తిట్టింది. ఈ ఘటన ఇదే ఏడాది మార్చిలో జరుగుగా, ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ యువతిది చాలా అస్యహకర ప్రవర్తనంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ వీడియోలో విపరీతంగా తాగిన ఓ యువతి రైడ్ సమయంలో క్యాబ్ డ్రైవర్‌ను దుర్భాషలాడడం ప్రారంభించింది. అతడిని పక్కకు నెట్టేందుకు ప్రయత్నించగా కారు ఆపి, పోలీసులను పిలిచాడు. మద్యం మత్తులో ఉన్న ఆ యువతి పోలీసు అధికారిని కూడా కాలర్ పట్టుకుని బెదిరించింది. ఒకానొక సమయంలో ఆమె రోడ్లపై పడుకొని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన 11 వీడియోలను ఒక యూజర్ ట్విటర్లో షేర్ చేశారు.
నివేదికల ప్రకారం..ఈ సంఘటన మార్చి 25, 2022 నాటిది. మద్యం మత్తులో పబ్లిక్ లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించినందుకు వీరంగం సృష్టించిన యువతితోపాటు ముగ్గురు యువతులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ వీడియో చూసి నెటిజన్లు మండిపడ్డారు. తాగి నడిరోడ్డుపై ఇలా ప్రవర్తించడమేంటి? అని యువతిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
A thread of 11 videos, drunk girl abusing everyone including Police
Video 1 pic.twitter.com/SC4AGM7h5j— Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) June 19, 2022