Watch: మద్యం మత్తులో బస్సును రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. వీడియో వైరల్
Drunk Driver Drives Bus In Reverse Gear | మద్యం సేవించి మత్తులో ఉన్న డ్రైవర్ బస్సును రివర్స్ గేర్‌లో వెనక్కి నడిపాడు. (Drunk Driver Drives Bus In Reverse Gear) దీంతో అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ సంఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: మద్యం సేవించి మత్తులో ఉన్న డ్రైవర్ బస్సును రివర్స్ గేర్‌లో వెనక్కి నడిపాడు. (Drunk Driver Drives Bus In Reverse Gear) దీంతో అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ సంఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం పూణేలోని విఠల్ బాబా చౌక్ ప్రాంతంలో పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంటీ)కు చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని రివర్స్ గేర్‌లో డ్రేవ్ చేశాడు. దీంతో ఆ బస్సు వేగంగా వెనక్కి వెళ్లడంతో వెనుక ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులు రక్షించాలంటూ హాహాకారాలు చేశారు.
కాగా, ఆ సమయంలో రోడ్డుపై ఉన్న జనం కూడా ఇది చూసి షాకయ్యారు. బస్సును ఆపాలంటూ కేకలు వేశారు. ఒక వ్యక్తి బస్సు అద్దాలు పగులగొట్టి డ్రైవర్ వద్దకు వెళ్లి బస్సును ఆపేందుకు ప్రయత్నించాడు. మద్యం సేవించిన బస్సు డ్రైవర్‌ను నీలేష్ సావంత్‌గా గుర్తించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
संतोष माने प्रकरणाची आठवण यावी असा थरार पुन्हा एकदा पुण्यात घडला. सेनापती बापट रोड परिसरात पीएमपीएमएलच्या बस चालकाने मद्यधुंद अवस्थेत दहा ते पंधरा गाड्यांना उडवल्याचा प्रकार घडला. या बसमध्ये सुमारे ५० प्रवासी प्रवास करत होते. महापालिका आयुक्त आणि पुणे पोलीस आयुक्तांनी या संपूर्ण… https://t.co/IZRlegLQgy
— Supriya Sule (@supriya_sule) October 22, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bus
- drives
- drunk driver
- Pune
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

