రేపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం.. 21 తుపాకులతో గౌరవ వందనం
న్యూఢిల్లీ : భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత 21 తుపాకులతో గౌవర వందనం స్వీకరించనున్నారు. ఉదయం 10.15గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగే ఈ వేడుకలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణం చేయిస్తారని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. వేడుకకు ముందు పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి, కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతులు ఊరేగింపుగా పార్లమెంట్కు చేరుకుంటారని హోంశాఖ పేర్కొంది.
ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల చీఫ్లు, పార్లమెంట్ సభ్యులు, ప్రధాన సైనిక అధికారులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. వేడుక అనంతరం రాష్ట్రపతి సెంట్రల్ హాలు నుంచి రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు. అక్కడ నూతన రాష్ట్రపతి ఇంటర్ సర్వీసెస్ గౌరవ వందనం సమర్పించనున్నది. ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను పాక్షికంగా మూసివేయాలని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

