DRDO | ఇక భారత్‌లోనే ఎల్ఏసీ మార్క్-2 ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ..! జనరల్ ఎలక్ట్రిక్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్..!
DRDO | భారత్‌లో ఎల్ఏసీ మార్క్-2 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ జెట్ ఇంజిన్ల తయారీకి మార్గం సుగమమైంది. జనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో ఇకపై దేశంలో ఫైటర్ జెట్ల ఇంజిన్లు తయారీకి అమెరికా అన్ని అనుమతులు జారీ చేసింది.
DRDO | భారత్‌లో ఎల్ఏసీ మార్క్-2 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ జెట్ ఇంజిన్ల తయారీకి మార్గం సుగమమైంది. జనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో ఇకపై దేశంలో ఫైటర్ జెట్ల ఇంజిన్లు తయారీకి అమెరికా అన్ని అనుమతులు జారీ చేసింది. ఈ సందర్భంగా డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ మాట్లాడుతూ ఎల్సీఏ మార్క్-2 ఇంజిన్లు స్వదేశీ అధునాతన మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లోని మొదటి రెండు స్క్వాడ్రన్లను అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుందని తెలిపారు.
ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను అమెరికా పేర్కొన్నారు. జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా రక్షణ తయారీ రంగంలో ఇరు దేశాల మధ్య పలు ముఖ్యమైన ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా భారతీయ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో కలిసి అమెరికా కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లను తయారు చేయనుంది. జనరల్ ఎలక్ట్రిక్ సంయుక్తంగా యూఎస్ కాంగ్రెస్‌లో ఫైటర్ ఇంజిన్లను తయారు చేసేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది.
ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని డీఆర్డీవో చీఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్-414 జెట్ ఇంజిన్లను తయారీ చేయనున్నది. రెండు కంపెనీలు కలిసి భారతదేశంలో 99 ఇంజిన్లను తయారు చేయనున్నాయి. దీని ధర బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఎల్సీఏ ఎంకే-2ను సిద్ధం చేయానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌కు మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అంచనా.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

