లడాఖ్: మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్(Combat Parachute)ను డీఆర్డీవో ఇవాళ లడాఖలో విజయవంతంగా పరీక్షించింది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన డ్రాప్ జోన్లో ఆ పరీక్ష చేపట్టారు. లడాఖ్‌లోని నియంత్రణ రేణ వద్ద ఉన్న న్యోమా ప్రాంతంలో ఈ ట్రయల్స్ నిర్వహించారు. ఇటీవల భారతీయ వైమానిక దళం న్యోమా ప్రాంతంలో ఓ ఎయిర్‌బేస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేషన్స్ కోసం ఆ ఎయిర్‌బేస్‌ను వాడనున్నారు. ప్రపంచంలోని ఎత్తైన ఎయిర్‌బేస్‌ల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. ఆగ్రాలోని డీఆర్డీవో ఏరియల్ డెలివరీ రీసర్చ్, డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో పాటు బెంగుళూరులోని డిఫెన్స్ బయోఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబ్ ఈ కొత్త తరహా మిలిటరీ పారాచూట్‌ను డిజైన్ చేసి డెవలప్ చేశాయి. ట్రయల్స్ సమయంలో.. వింగ్ కమాండర్ రాహుల్, చీఫ్ టెస్ట్ జంపర్ ఆర్జే సింగ్, ఎండబ్ల్యూఓ వివేక్ తివారిలు.. మిలిటరీ పారాచూట్ ద్వారా సముద్ర మట్టానికి సుమారు 22 వేల ఫీట్ల ఎత్తు నుంచి దూకినట్లు డీఆర్డీవో పేర్కొన్నది.
Military Combat Parachute System (MCPS) designed and developed by ADRDE, DRDO was successfully tested at one of the world’s highest altitudes Drop Zones (Nyoma, Mudh DZ).
ADRDE test Jumpers Wg Cdr Rahul Jha Chief Test Jumper, MWO R J Singh, VM(G), MWO Vivek Tiwari executed the… pic.twitter.com/0wD82QdYo3
— DRDO (@DRDO_India) August 26, 2026
20 వేల ఫీట్ల ఎత్తు నుంచి పారాచూట్లో జంపర్స్ సుమారు 13,700 ఫీట్ల ఆల్టిట్యూడ్‌లో సురక్షితంగా దిగారు. 15 డిగ్రీల సెల్సియస్ అతిశీతల వాతావరణంలోనూ ట్రయల్స్ నిర్వహించారు. జంప్‌లో పాల్గొన్న టెస్టర్లు.. స్వదేశీ పారా కంప్యూటర్, ఆక్సిజన్ సిస్టమ్, జంప్సూట్లు వాడారు. గతంలో న్యోమా ప్రాంతాన్ని అనేక సైనిక విన్యాసాల కోసం వాడారు. దళాలు, వాహనాలు, సామాగ్రి పారా డ్రాపింగ్ చేసేవారు.