TARA Glide Weapon: తారా గ్లైడ్ వెపన్ సిస్టమ్‌ను పరీక్షించిన డీఆర్డీవో
TARA glide weapon system: తారా గ్లైడ్ వెపన్ సిస్టమ్ బాంబును ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. తారా అంటే టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగుమెంటేషన్(టీఏఆర్ఏ). ఇదొకరమైన బాంబు. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. అనుకున్న చోటుకు ఈ బాంబు గ్లైడ్ చేస్తూ వెళ్తుంది.
భువనేశ్వర్: కొత్త తరహా ఆయుధాన్ని డీఆర్డీవో పరీక్షించింది. తారా గ్లైడ్ వెపన్ సిస్టమ్( TARA glide weapon system) బాంబును ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. తారా అంటే టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగుమెంటేషన్(టీఏఆర్ఏ). ఇదొకరమైన బాంబు. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. సంప్రదాయకరమైన వార్‌హెడ్స్‌తో ఈ సిస్టమ్ ద్వారా కచ్చితమైన టార్గెట్లను ధ్వంసం చేయవచ్చు. గ్లైడింగ్ తరహాలో ఈ వెపన్ సిస్టమ్ పనిచేస్తుంది. డీఆర్డీవో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించాయి. తక్కువ ఖర్చుతో ఈ బాంబును రూపొందించారు. స్వదేశీయంగా తయారైన తొలి గ్లైడ్ వెపన్ సిస్టమ్ ఇది అని కేంద్ర రక్షణ శాఖ చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన రీసర్చ్ సెంటర్ ఇమారత్ దీన్ని డెవలప్ చేసింది. కొన్ని డీఆర్డీవో ల్యాబ్‌లు కూడా దీంట్లో కీలక పాత్ర పోషించాయి. సంప్రదాయకర బాంబుల తరహాలో కాకుండా.. గ్లైడ్ వెపన్స్.. ఏరోడైనమిక్ తరహా పనిచేస్తాయి. ఈ బాంబును వదిలిన తర్వాత టార్గెట్‌ను చేరేందుకు ఆ వెపన్ గ్లైడింగ్ చేస్తుంది. కొంత దూరం ఇలా ఆ బాంబు ట్రావెల్ చేయగలదు. మాడ్యులార్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్‌గా దీన్ని భావిస్తున్నారు. దిశా నిర్దేశం లేని బాంబులను ఈ టెక్నాలజీ ద్వారా అనుకున్న లక్ష్యం చేరే రీతిలో గ్లైడ్ చేస్తారు.
Maiden flight-trial of Tactical Advanced Range Augmentation (TARA) weapon was successfully conducted off the coast of Odisha on May 07, 2026.
TARA, the modular range extension kit, is India’s first indigenous glide weapon system to convert unguided warheads into precision guided… pic.twitter.com/Ofx8mrGGgY
— DRDO (@DRDO_India) May 8, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

