ఉగ్రం.. శత్రు భయంకరం
కదన రంగంలో శత్రువులకు వెన్నులో వణుకు పుట్టించే దేశీయ రైఫిల్ ‘ఉగ్రం’ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆవిష్కరించింది. డీఆర్డీవో ఆధ్వర్యంలోని ఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏఆర్డీఈ) హైదరాబాద్‌కు చెందిన ద్వీపా ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి 100 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఈ రైఫిల్‌ను అభివృద్ధి చేసింది.
- దేశీయ రైఫిల్‌ను ఆవిష్కరించిన డీఆర్డీవో
- ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి
- 100 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే తయారీ
- రేంజ్ 500 మీటర్లు.. ‘ఇన్సాస్’ కంటే పవర్ఫుల్
హైదరాబాద్, జనవరి 9: కదన రంగంలో శత్రువులకు వెన్నులో వణుకు పుట్టించే దేశీయ రైఫిల్ ‘ఉగ్రం’ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆవిష్కరించింది. డీఆర్డీవో ఆధ్వర్యంలోని ఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏఆర్డీఈ) హైదరాబాద్‌కు చెందిన ద్వీపా ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి 100 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఈ రైఫిల్‌ను అభివృద్ధి చేసింది.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చేసిన ఆయుధం ఇదే కావడం విశేషం. 7.2 ఎంఎం క్యాలిబర్ రౌండ్లను కలిగి ఉండే ఈ రైఫిల్ మన దేశంలో సాయుధ బలగాలు విరివిగా ఉపయోగించే ‘ఇన్సాస్’ రైఫిల్ కంటే ఎంతో భీకరమైనది. సైనిక, పారామిలిటరీ, పోలీసు బలగాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ‘ఉగ్రం’ రైఫిల్‌ను అభివృద్ధి చేశారు. కార్గిల్ యుద్ధ సమయం నుంచి ఉపయోగిస్తున్న ‘ఇన్సాస్’ రైఫిళ్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. 4 కిలోల బరువు ఉండే ‘ఉగ్రం’ రైఫిల్ 500 మీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుంది.
ఇది దాదాపు 5 ఫుట్‌బాల్ మైదానాలంత దూరానికి సమానం. త్వరలో ఈ రైఫిల్‌ను ట్రయల్స్‌కు పంపనున్నట్టు ఏఆర్డీఈ డైరెక్టర్ అంకతి రాజు తెలిపారు. 7.62 ఎంఎం క్యాలిబర్ రౌండ్లను కలిగి ఉండే ఏకే-203 రైఫిళ్ల అభివృద్ధి కోసం భారత్ ఇప్పటికే రష్యాతో చేతులు కలిపింది. దీంతో ఈ రైఫిళ్లను దేశీయంగా తయారు చేసేందుకు ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్ఆర్పీఎల్) పేరుతో ఉత్తరప్రదేశ్‌లోని కోర్వాలో ఓ జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటైంది. దాదాపు 300 మీటర్ల రేంజిని కలిగి ఉండే ఏకే-203 రైఫిళ్లు ప్రస్తుతం తయారీ, పరీక్షల దశలో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- armed forces
- DRDO
- Indian Army
- Ugram
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

