న్యూఢిల్లీ, జూన్ 9: చిన్నపిల్లల్లో కరోనా తీవ్రత, చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వివరాలు..
స్టెరాయిడ్లను ఇవ్వకూడదు. లక్షణాలులేని, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారికి ఇవి హానికరం.
తక్కువ, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారిలో జ్వరం తగ్గేందుకు ప్రతి 4-6 గంటలకు ఒకసారి పారాసిటమాల్ 10-15ఎంజీ/కేజీ/డోసు ఇవ్వొచ్చు.
గదిలో పిల్లలు ఆరు నిమిషాల పాటు నడిచాక, పల్స్ ఆక్సీమీటర్ సాయంతో వారి ఆక్సిజన్ స్థాయులు తెలుసుకోవాలి. ఆక్సిజన్ సమస్య తలెత్తితే వైద్యుల్ని సంప్రదించాలి.