Jaggi Vasudev | సద్గురు ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చిన ఆయన కూతురు
Jaggi Vasudev | ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కూతురు అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం సద్గురు బాగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నట్లు తెలిపారు.
Jaggi Vasudev | ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev)కు బ్రెయిన్ సర్జరీ (brain surgery) జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి జగ్గీ వాసుదేవ్ కూతురు రాధే జగ్గీ (Radhe Jaggi) అప్డేట్ (health update) ఇచ్చారు. ప్రస్తుతం సద్గురు బాగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ‘నమస్కారం. సద్గురు ఆరోగ్య పరిస్థితి గురించి చాలా మంది అడుగుతున్నారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. త్వరగా కోలుకుంటున్నారు’ అంటూ తన తండ్రి ఆరోగ్యంపై రాధే జగ్గీ ఇన్‌స్టా గ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చారు.
66 ఏండ్ల జగ్గీ వాసుదేవ్ గత నాలుగు వారాల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఈ నెల 8న జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వైద్యుల బృందం ఆయనకు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించింది. సద్గురు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు అపోలో వైద్యులు కూడా తెలిపారు.
Also Read..
PM Modi | రష్యా – ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి భారత్ పూర్తి మద్దతు : ప్రధాని మోదీ
Bengaluru | బెడ్రూమ్ కిటికీ తెరిచి ఉంచుతున్నారంటూ.. పొరుగింటి జంటపై మహిళ ఫిర్యాదు
Paarijatha Parvam | కిడ్నాప్ అనేది క్రైమ్ కాదు ఒక ఆర్ట్.. ఆసక్తికరంగా ‘పారిజాత పర్వం’ టీజర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

