Dog fight | డాగ్ ఫైట్‌పై వాట్సాప్ గ్రూప్‌లో విమర్శ.. ఒక వ్యక్తిని కాల్చి చంపిన ముగ్గురు
Dog fight | డాగ్ ఫైట్‌ను చూసిన రాజ్‌కమల్, చనిపోయిన ఆనంద్ కుక్కపై ఆ వాట్సాప్ గ్రూప్‌లో విమర్శిస్తూ కొన్ని మెసేజ్‌లు పోస్ట్ చేశాడు. దీంతో సభ్యుల మధ్య చర్చకు, వాగ్వాదానికి ఇది దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆనంద్‌ను ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు.
లక్నో: డాగ్ ఫైట్‌పై ఒక వ్యక్తి వాట్సాప్ గ్రూప్‌లో విమర్శించాడు. ఫైట్‌లో చనిపోయిన కుక్కపై వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు అతడ్ని కాల్చి చంపారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు అక్రమంగా డాగ్ ఫైట్ నిర్వహిస్తున్నారు. రాజకమల్ అనే వ్యక్తి దీని కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఫిబ్రవరి 26న పటౌడీలోని బసపదంక గ్రామంలో పెంపుడు కుక్కల మధ్య ఫైట్ నిర్వహించారు. ఈ ఫైట్‌లో ఆనంద్ కుమార్‌కు చెందిన కుక్క చనిపోయింది.
కాగా, డాగ్ ఫైట్‌ను చూసిన రాజ్‌కమల్, చనిపోయిన ఆనంద్ కుక్కపై ఆ వాట్సాప్ గ్రూప్‌లో విమర్శిస్తూ కొన్ని మెసేజ్‌లు పోస్ట్ చేశాడు. దీంతో సభ్యుల మధ్య చర్చకు, వాగ్వాదానికి ఇది దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆనంద్‌ను ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. దీంతో రాజ్‌కమల్‌పై అతడు శతృత్వం పెంచుకున్నాడు. అదే రోజు రాత్రి వేళ ఆనంద్ మరో ఇద్దరు కలిసి గన్‌తో కాల్పలు జరిపి రాజ్‌కమల్‌ను చంపారు.
మరోవైపు రాజ్‌కమల్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులైన ఆనంద్ కుమార్, హితేష్ అలియాస్ డేవిడ్, భూపేందర్ అలియాస్ భీమ్‌లను అరెస్టు చేశారు. నాటు తుపాకీ, బుల్లెట్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్ నోయిడాలోని ఒక అకాడమీలో టెన్నిస్ టీచర్ అని పోలీసులు తెలిపారు. హితేష్ మాజీ జావెలిన్ త్రోయర్ కాగా, భూపేందర్ టోల్ ప్లాజాలో పనిచేస్తున్నాడని వెల్లడించారు.
Cow Hug Day | ‘కౌ హగ్ డే’ను వెనక్కి తీసుకోవడంపై కోర్టులో సవాల్.. పిటిషన్ తిరస్కరణ
Viral Video | అంతర్జాతీయ వన్యప్రాణి దినోత్సవం : అరుదైన వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

